ఖ‌మ్మంలో ఒమిక్రాన్ క‌ల‌క‌లం.. తొలి కేసు న‌మోదు

First Omicron Case registered in Khammam.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తుండ‌గా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 3:16 AM GMT
ఖ‌మ్మంలో ఒమిక్రాన్ క‌ల‌క‌లం.. తొలి కేసు న‌మోదు

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తుండ‌గా.. మ‌న‌దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో త‌న పంజా విసురుతోంది. తాజాగా ఖ‌మ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు న‌మోదు అయింది. ఖమ్మం పట్టణంలోని వైరారోడ్డులో గ‌ల ఓ అపార్ట్‌మెంట్‌లో 21 ఏళ్ల‌ యువతికి ఓమిక్రాన్ గా నిర్దారణ అయ్యింది.

హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువ‌తి ఈ నెల 19న ఖ‌మ్మంలో నివ‌సిస్తున్న అమ్మ‌మ్మ ఇంటికి వ‌చ్చింది. అయితే.. క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాల‌తో ఈనెల 20న ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రిలో ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష చేయించుకోగా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా వైద్యాధికారులు ఆమె నుంచి సేక‌రించిన న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్స్ ప‌రీక్ష‌ల కోసం హైద‌రాబాద్‌కు పంపారు. యువ‌తికి ఒమిక్రాన్ వైర‌స్ సోకిన‌ట్లు ఆదివారం నిర్థార‌ణ అయ్యింది. వెంట‌నే జిల్లా వైద్యాధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆమెను క్వారంట‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తుండ‌గా.. యువ‌తి కుటుంబ స‌భ్యుల న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల కోసం పంపారు. ప్ర‌స్తుతం బాధితురాలి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు.

ఖమ్మం యువతితో కలిపి తెలంగాణ రాష్ట్రంలో నిన్న‌ కొత్తగా 3 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి. వీటితో క‌లిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44 కి పెరిగింది. మొత్తం కేసుల్లో 10 మంది కోలుకున్నారు. కాగా.. కొత్తగా నమోదైన మూడు కేసుల్లో రెండు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికుల‌వి.

Next Story
Share it