ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న మంట‌లు

Fire breaks out in pharma unit in Sangareddy.సంగారెడ్డి జిల్లాలోని ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Feb 2023 1:33 PM IST
ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న మంట‌లు

సంగారెడ్డి జిల్లాలోని ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. భారీగా మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి.

జిన్నారం మండ‌లం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మాలో బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ ఆవ‌ర‌ణ‌లోని కాల్వెంట్ డ్ర‌మ్ యార్డులో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డాయి. ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ‌ అలుముకుంది. కార్మికులు భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, నాలుగు ఫైరింజన్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు కార్మికులు గాయ‌ప‌డ‌గా వారిని ఆస్ప‌త్రిలో చేర్పించారు.

కంపెనీలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన కెమికల్ వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కెమిక‌ల్ నిల్వ‌ ఉన్న డ్ర‌మ్ములు పేలిపోతున్నాయి. కాగా.. మంట‌లు ఎలా అంటుకున్నాయి అన్న సంగ‌తి ఇంకా తెలియ‌రాలేదు.

Next Story