Hanamkonda: కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు చెలరేగాయి.

By Srikanth Gundamalla  Published on  5 March 2024 11:20 AM IST
Fire accident, Kazipet Railway Station, warangal,

 Hanamkonda: కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం 

కొన్నాళ్లుగా ఇండియన్ రైల్వేలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒకదాని తర్వాత మరోటి సంభవించాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రయాణికులు చనిపోగా.. ఇంకొన్ని ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనను రేకెత్తించాయి. అయితే.. తాజాగా ఇండియన్‌ రైల్వేలో మరో ప్రమాదం సంభవించింది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రైలు భోగి కాలిపోయింది. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు.

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలులో మంటలు చెలరేగడంతో అక్కడంతా భాయందోళన వాతావరణం నెలకొంది. మంటలతో పాటు భారీగా పొగ అలుముకుంది. ఆ ప్రాంత మంతా చీకటి మయం అయ్యింది. కాగా.. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. మంటలు చెలరేగిన బోగీ వద్దకు వెళ్లారు. మంటలను అదుపు చేశారు. కాగా.. ఆగివున్న రైలు బోగీలో మంటలు ఎలా చెలరేగాయనేది తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేశామనీ రైల్వే పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక రైలు బోగీలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేరనీ.. దాంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే సిబ్బంది తెలిపారు.


Next Story