పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident In Puranapool. హైదరాబాద్ నగరంలోని పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

By M.S.R  Published on  15 Feb 2023 5:18 PM IST
పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలోని పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పురానాపూల్‌లో ఉన్న ఓ గోదాంలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో టైర్లకు సంబంధించిన మెటీరియల్‌ ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయా లేక మరేదైనా కారణంగా ప్రమాదం జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఎక్కువగా ప్లాస్టిక్‌ సామగ్రి ఉండటంతో దట్టమైన పొగతో పాటు మంటలు కూడా భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో సమీపంలో నివసిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.


Next Story