కోరుట్లలో కాలిబూడిదైన షాపింగ్ మాల్

Fire Accident in Korutla Shopping mall.జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బుధ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 9:44 AM IST
కోరుట్లలో కాలిబూడిదైన షాపింగ్ మాల్

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బుధ‌వారం తెల్ల‌వారు జామున స్థానిక ఆనంద్ షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పెద్ద ఎత్తున వ్యాపించి భ‌వ‌నం మొత్తం అంటున్నాయి. వ‌స్త్ర దుకాణం కావ‌డంతో మంట‌లు వేగంగా వ్యాపించాయి. మంట‌లు పెద్ద ఎత్తున ఎగిసి ప‌డుతుండ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బందికి అక్క‌డికి చేరుకునే లోపే షాపింగ్ మాల్‌లోని సామాగ్రి అంతా కాలి బూడిదైంది. అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టినా.. మంట‌లు అదుపులోకి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఈ ప్ర‌మాదంలో భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లింది. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story