సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

Fire Accident in electric sub station in Sitaramapuram.భదాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో భారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2021 6:31 AM GMT
సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

భదాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. పాల్వంచ ప‌ట్ట‌ణ ప‌రిధిలోని సీతారామ‌పురం స‌బ్‌స్టేష‌న్‌లో ఈ రోజు ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. విద్యుత్ కండ‌క్ట‌ర్ వెరు తెగి ట్రాన్స్ఫార్మర్ మీదపడటంతో ఒక్క‌సారి భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. అగ్ని కీలలు సబ్‌ స్టేషన్‌ మొత్తం చుట్టుముట్టాయి. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. హుటాహుటిన ఘ‌టనాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అప్ప‌టికే స‌బ్‌స్టేష‌న్ స‌గానికిపైగా అగ్నికి ఆహుతైంది. ప్ర‌మాదం జరిగిన స‌మ‌యంలో ఆరుగురు సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎవ్వ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేదు. ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం కారణంగా సబ్‌ స్టేషన్‌లోని పలు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Next Story