హైదరాబాద్: వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డెసిషన్ తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 2,363 పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 944 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, 87 పోస్టులను మినిమం టైమ్ స్కేల్ విధానంలో, 1332 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది.
త్వరలోనే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌కు సంబంధించిన సేవలు మెరుగుపర్చడం, సర్కార్ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ పోస్టుల నియామకాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో నాణ్యత పెరగనుంది.