హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాఆల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అటు త్వరలోనే మహిళా, శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసింది. గతేడాది జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. అయితే మళ్లీ గ్రామ పాలన అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.