మద్యానికి డబ్బులివ్వలేదని.. బాలుడిపై వేడి నూనె పోసిన తండ్రి

Father pours hot oil on son in mancherial. మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన

By అంజి  Published on  25 July 2022 8:38 AM IST
మద్యానికి డబ్బులివ్వలేదని.. బాలుడిపై వేడి నూనె పోసిన తండ్రి

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన దారుణానికి తెగించాడు. కొడుకుపై తండ్రి వేడి వేడి నూనె పోసి చిత్రహింసలకు గురి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని కాసేపట మండలంలో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. దేవాపూర్‌ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు అబ్బూ తల్లిదండ్రులు మద్యానికి బానిసై ఇంట్లో ఉంటున్నారు. తినడానికి కూడా కష్టంగా మారడంతో కుటుంబ పోషణ కోసం ఆ బాలుడే గ్రామంలో భిక్షాటన చేస్తున్నాడు.

ఈ క్రమంలో వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం అబ్బూకు భిక్షాటనలో డబ్బులు రాలేదు. దీంతో ఇంటికి ఏం తీసుకు వెళ్లలేకపోయాడు. మద్యాన్ని డబ్బులు ఇవ్వలేదని తండ్రి ఎండీ ఇస్మాయిల్‌ కొడుకు అబ్బూను ఇంట్లోనే బంధించాడు. ఆదివారం నాడు బాలుడి చేతులపై వేడి వేడి నూనెను పోశాడు. దీంతో నొప్పి భరించలేక బాలుడు గట్టిగా కేకలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆ ఇంటికి వచ్చి బాలుడిని ఆ దుర్మార్గపు తండ్రి నుంచి విడిపించి ఆస్పత్రికి తరలించారు.

Next Story