నిర్మల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌

నిర్మల్‌ జిల్లా భైంసా బస్ డిపో సమీపంలో సత్‌పూల్‌ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్‌ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి.

By -  అంజి
Published on : 20 Jan 2026 7:06 AM IST

Fatal road accident, Nirmal district, Four dead, Telangana

నిర్మల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌

నిర్మల్‌ జిల్లా భైంసా బస్ డిపో సమీపంలో సత్‌పూల్‌ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్‌ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు హైదరాబాద్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులు కుబీర్‌ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాబన్న, భోజరాం పటేల్‌, రాజన్న, కారు వికాస్‌లుగా గుర్తించారు. స్థానికుల సమాచారం ద్వారా ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story