క‌ట్ట‌లు తెంచుకున్న ఆగ్ర‌హం.. థియేట‌ర్ లో ర‌చ్చ చేసిన‌ ప‌వ‌న్ అభిమానులు

Fans Destroyed Theater In Gadwal. గద్వాల జిల్లా కేంద్రంలోని టాకీస్ లో వకీల్ సాబ్ సినిమా మొదటి ఆట సాటిలైట్ సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య రావ‌డంతో ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

By Medi Samrat  Published on  9 April 2021 4:19 AM GMT
Fans Destroyed Theater

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల త‌రువాత న‌టించిన చిత్రం 'వకీల్ సాబ్'. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9 శుక్ర‌వారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రను పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పింక్‌ రీమేక్. అక్క‌డ అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ బజ్‌ని తీసుకుని వచ్చాయి.

ఇదిలావుంటే.. జోగులాంబ‌ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్ లో వకీల్ సాబ్ సినిమా మొదటి ఆట ప‌డింది. సాటిలైట్ సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య రావ‌డంతో అర్ధాంతరంగా సినిమా ఆగిపోయింది. ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఒక్కసారిగా కోపోద్రిక్తులవుతూ.. కుర్చీలు, తలుపులు విరగొట్టారు. సినిమా మళ్ళీ మొదటి నుండి ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ శాంతించారు.


Next Story