హైదరాబాద్: బీజేపీకి బీసీలు, ఎస్సీల నుంచి మద్దతు రావడం సంతోషంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రచార వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారన్న కిషన్ రెడ్డి.. బీజేపీ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోను రూపొందించామన్నారు. బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫేక్ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే సాధ్యమన్నారు. రాష్ట్రం ఆర్థిక మూలాలను బీఆర్‌ఎస్ దెబ్బతీసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని, భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. అధికారపార్టీ నాయకులు బెదిరించినా ప్రజలు స్వచ్చంధంగా ముందుకొస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజల నెత్తిన భస్మాసుర హస్తమే అన్నారు. కర్నాటకలో ఇచ్చిన హామీలు అమలు చేశారా అంటూ కాంగ్రెస్‌ని సూటిగా ప్రశ్నించారు కిషన్‌రెడ్డి.