సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా: మంత్రి జూపల్లి

నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు...

By -  అంజి
Published on : 1 Feb 2026 1:40 PM IST

Excise constable Soumya, 1 crore ex-gratia, Minister Jupally Krishna Rao, Telangana

సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా: మంత్రి జూపల్లి

నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కొల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య ప్రాణాలు వదిలారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు. జనవరి 23న ఇద్దరు స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సౌమ్యను కారుతో ఢీకొట్టారు. రివర్స్‌ తీస్తూ మరోసారి కారును ఆమెపై నుంచి తీసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఒక కిడ్నీ తొలగించారు.

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతిపట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రూ.1కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Next Story