మండుటెండ‌ల్లో ప‌ని చేయ‌డం క‌ష్టం.. అలాంటి వారి కోస‌మే 'నీడ' : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

EX MP Konda Vishweshwar reddy share Needa innovation.ఎండ‌లు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2022 9:15 AM IST
మండుటెండ‌ల్లో ప‌ని చేయ‌డం క‌ష్టం.. అలాంటి వారి కోస‌మే నీడ : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

ఎండ‌లు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎండ వేడికి చర్మం భగ్గు మంటోంది. వేడి గాలులు వీస్తుండ‌డంతో ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇంట్లో ఉంటే ఫ్యానో, కూల‌రో, ఏసీనో లేదంటే చెట్టుకు కింద‌నో కూర్చుని సేద తీరొచ్చు. అయితే.. వ్య‌వ‌సాయ ప‌నులు చేసేవారు, కూలీలు, మండుటెండ‌ల్లో ప‌నులు చేసే వారి ప‌రిస్థితి ఏంటీ..? బ‌తుకు బండి లాగేందుకు మండుటెండుల్లో వారు ప‌నిచేయ‌క త‌ప్ప‌డం లేదు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ను తీసుకొచ్చారు.

'నీడ' అనే ఆవిష్క‌ర‌ణ‌ను తీసుకువ‌చ్చారు. ఇది చేవేళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో గొప్ప విజ‌యం సాధించింద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న తెలిపారు. పొలాల్లో పనిచేసే మహిళలు, వీధి వ్యాపారలు, గొర్రెల కాపరులు, మున్సిప‌ల్ కార్మికులు, కూలీలు, ఇత‌ర వ్యాపారులు ఎండ‌ల్లో ప‌ని చేయ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న‌ది. వారి కోసం మేము త‌యారు చేసిన చిన్న ఆవిష్క‌ర‌ణ నీడ‌. చేవేళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది. చెత్రి(గొడుగు) లెక్క కాకుండా, దీన్ని నెత్తికి తొడుక్కుని రెండు చేతుల‌తో ప‌ని చేసుకోవ‌చ్చు. వారు పని చేయడానికి కిందకు వంగి ఉన్నప్పుడు.. ఇది వారి వీపును కూడా ఎండ నుంచి రక్షిస్తుందని తెలిపారు.

ఓ ఆలోచ‌న‌కు రూపం తెచ్చేందుకు రెండు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. 25 ర‌కాల మోడ‌ళ్లు త‌యారు చేశాము. చివ‌రికి ఓ మంచి దాన్ని తీసుకువ‌చ్చాము. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పటికీ.. జూమ్ ద్వారా వర్క్ చేశాం. ఇప్పుడే పంపిణీ చేయడం ప్రారంభించినట్టుగా ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు. వేసవి దాదాపు ముగిసిందన్నారు. ఇది వర్షాల నుంచి రక్షించడానికి ఉప‌యోగ‌ప‌డ‌ద‌న్నారు. గాలులు బలంగా వీస్తున్న సమయంలో దానిని చేతులతో పట్టుకోవచ్చని చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్లు, ఎద్దుల బండి నడిపేవారు, మున్సిపల్ కార్మికులు, పొలాల్లో పనిచేసే మహిళలు.. తమ నీడ పరికరాలను ఇష్టపడుతున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.

Next Story