మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు: హరీష్ రావు
కాళేశ్వరంపై ఆదివారం నాడు చర్చ పెట్టారంటనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆరోపించారు.
By అంజి
మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు: హరీష్ రావు
కాళేశ్వరంపై ఆదివారం నాడు చర్చ పెట్టారంటనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆరోపించారు. రిపోర్టులోని 650 పేజీల్లో ఉన్న ప్రతి పేజీకి సమాధానం చెబుతానన్నారు. 'కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్‌కు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది. పారదర్శకంగా విచారణ జరగపోతే అది చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయి' అని ఆయన గుర్తు చేశారు.
తుమ్మడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009 - 14లో కేంద్రం చెప్పినా దొపిడీ చేసేందుకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఆ విషయం దాచి 2015లో ఉమా భారతి లేఖను పట్టుకుని హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారని అసెంబ్లీలో తెలిపారు.
తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదని, క్యాబినెట్‌లో చర్చించామని హరీష్ రావు అసెంబ్లీలో తెలిపారు. నీరు లేని చోటు నుంచి నీరు ఉన్న చోటుకు మార్చామన్నారు. ''2009 - 2014 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా.. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. ఆంధ్రా పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే కాళేశ్వరం నిర్మించాం'' అని తెలిపారు.