తెలంగాణలో మావోయిస్టుల శకం ముగింపు..42 మంది కీలక నేతల లొంగుబాటు (video)
తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యానికి దాదాపు తెరపడింది
By - Knakam Karthik |
తెలంగాణలో మావోయిస్టుల శకం ముగింపు..42 మంది కీలక నేతల లొంగుబాటు (video)
తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యానికి దాదాపు తెరపడింది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, కేడర్ లొంగిపోగా, తాజాగా శుక్రవారం డీజీపీ బి. శివధర్ రెడ్డి సమక్షంలో మరో 42 మంది పీఎల్‌జీఏ (PLGA) కేడర్ లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ కమాండర్ సోడి మల్లా అలియాస్ నిఖిల్ వంటి కీలక నేతలు ఉండగా, వారు తమతో పాటు 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారాన్ని అప్పగించారు.
ఈ లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, రాష్ట్రం ఇప్పుడు నక్సలిజం నుండి విముక్తి పొందిందని డీజీపీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం వెలుపల ఇతర ప్రాంతాల్లో కేవలం ఐదుగురు తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు మాత్రమే ఉన్నారని, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా మిగిలిన వారందరూ సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున డీజీపీ విజ్ఞప్తి చేశారు.
#Hyderabad:42 #Maoists, including #PLGA battalion deputy commander Sodi Keshalu alias Kesha, have surrendered before @TelanganaDGP B Shivadhar Reddy, handing over 36 #weapons, including AKs, SLRs, #INSASrifles, BGL guns, a #pistol and #revolvers.Officials say the CPI-Maoists’… pic.twitter.com/Erhm9c81ar
— NewsMeter (@NewsMeter_In) April 10, 2026