సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 11 మంది ముస్లిం యువతుల అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అసలు కారణం చెప్పకుండా పదకొండు మంది ముస్లిం బాలికలను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి),

By అంజి
Published on : 14 Jun 2023 10:00 AM IST

Hyderabad, Muslim girls, Secunderabad Railway Station

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 11 మంది ముస్లిం యువతుల అరెస్టు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అసలు కారణం చెప్పకుండా పదకొండు మంది ముస్లిం బాలికలను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఎహెచ్‌టి) అరెస్టు చేశారు. మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన బాలికలు హఫీజ్ బాబా నగర్, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట నివాసితులు. ముస్లిం బాలికల బంధువులు చెప్పిన తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబంలోని 25 మంది సభ్యులు ఖమ్మం జిల్లాకు వలిమా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అయితే, వారు జూన్ 12, 2023 న హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత, వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన వెంటనే జీఆర్‌పీ, ఆర్పీఎఫ్, ఏహెచ్‌టీ విభాగాల అధికారులు తమను చుట్టుముట్టారని ఆరోపించారు. వారి బ్యాగులను కూడా అధికారులు సోదా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులకు సహకరించి సరైన రైలు టిక్కెట్లు, ఆధార్ కార్డులు చూపించినప్పటికీ బాలికలను అంబర్‌పేటలోని జువైనల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సెంటర్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఘటన వివరాలను విన్న ఎంబీటీ ప్రతినిధి అంజేద్ ఉల్లా ఖాన్ బాలికల విడుదల కోసం సంబంధిత అధికారులను సంప్రదించారు.

బాలికలను విడుదల చేసిన తర్వాత సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై ఖాన్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఆర్‌పీఎఫ్‌ సికింద్రాబాద్ స్పందించింది. అవసరమైన చర్య కోసం పై అధికారులకు తెలియజేయబడిందని తెలిపింది.

Next Story