హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలింది. రైతు భరోసా (బంధు) డబ్బుల చెల్లింపులపై ఈసీ ఆంక్షలు విధించింది. తెలంగాణలో మే 13న పోలింగ్ పూర్తయ్యే వరకు మిగిలిన రైతు భరోసా సొమ్మును పంపిణీ చేయవద్దని భారత ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 9వ తేదీ లోగా రైతుభరోసా నిధులు జమ చేస్తామని పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడాన్ని కోడ్ ఉల్లంఘన కింద భావించిన సీఈసీ.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
''తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా (రైతు బంధు) పథకం కింద డబ్బులు పంపిణీ చేయడం గురించి బహిరంగంగా మాట్లాడటం ద్వారా కొనసాగుతున్న పథకానికి సంబంధించి ఈ విషయంలో నిర్దేశించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షరతులను ఉల్లంఘించారు'' qlr ఈసీ పేర్కొంది మే 9, 2024కి ముందు ఇది మీడియాలో కూడా నివేదించబడింది.