జగ్గారెడ్డి హంగామాపై సీరియస్‌గా స్పందించిన ఎన్నికల కమిషన్

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది.

By -  Knakam Karthik
Published on : 12 Feb 2026 11:30 AM IST

Telangana, Municipal Elections, Jagga Reddy, Sangaredduy District, Election Commission

జగ్గారెడ్డి హంగామాపై సీరియస్‌గా స్పందించిన ఎన్నికల కమిషన్

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. నిన్న జరిగిన పోలింగ్ సందర్భంగా ఇంద్రనగర్‌లోని ఎంఎపిపీఎస్ (MPPS) పోలింగ్ స్టేషన్ వద్ద జరిగిన హంగామా నేపథ్యంలో, ఆ కేంద్రానికి సంబంధించిన సీసీటీవీ రికార్డులను ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఉదయం నుంచే 34వ వార్డు మహిళా అభ్యర్థి రిజ్వాన కుమారుడు హైమద్ పోలింగ్ స్టేషన్ వద్ద ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అక్కడి అధికారులను దూషిస్తూ, ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించేలా ప్రవర్తించినట్లు ఓటర్లు చెబుతున్నారు. అతను చేసే హంగామాను భరించలేక పలువురు ఓటర్లు పోలీసు లకు తెలియజేయడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు హైమద్‌ను పోలింగ్ కేంద్రం పరిధి నుండి దూరంగా పంపించారు.

అయితే పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని హైమద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారిపై తిరగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది. అయితే అదే సమయంలో జగ్గారెడ్డి ఆ ప్రాంతానికి వచ్చి విషయం తెలుసుకోకుండానే పోలీసులపై విరుచుకు పడుతూ బూతు పురాణానికి దిగాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలని అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ తీవ్రస్థాయిలో మండిపడింది... అనంతరం ఎన్నికల కమిషన్ పోలీసుల స్టేట్మెంట్ను రికార్డు చేసింది... ఎన్నికలవేళ ఈ విధంగా పోలింగ్ బూత్ వద్ద హంగామా చేసిన జగ్గారెడ్డి పై కేసు నమోదు చేయా లంటూ ఆదేశాలు జారీ చేసింది... ఇలా పోలింగ్ బూత్ వద్ద జగ్గారెడ్డి ఆగ్రహించడంతో అతనిపై కేసు నమోదు కావడంతో ఇప్పుడు రాజకీయాల్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Next Story