పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా..అమల్లోకి ఎన్నికల కోడ్

తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది

By -  Knakam Karthik
Published on : 29 Sept 2025 10:52 AM IST

Telangana, local body elections, Election Commission

పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా..అమల్లోకి ఎన్నికల కోడ్

తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ రాణి కుముదిని వివరాలు మీడియాకు వెల్లడించారు. మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్. అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్. అక్టోబర్ 17న సర్పంచి ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేస్తారు. 31న తొలి విడత పోలింగ్. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు. నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు. నవంబర్ 8న పోలింగ్. కాగా మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Next Story