‘రైతుబంధు’కు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ‌ రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం త్వ‌ర‌లోనే ఖాతాల్లో జ‌మ కానుంది.

By Medi Samrat  Published on  24 Nov 2023 9:40 PM IST
‘రైతుబంధు’కు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ‌ రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం త్వ‌ర‌లోనే ఖాతాల్లో జ‌మ కానుంది. ప్ర‌భుత్వం ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10వేలు అందిస్తుంది. రెండు విడుతల్లో ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేకపోయింది. అయితే ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలకై ఈసీ అనుమతి కోరగా.. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్‌తో ఈ నిధుల విడుదల ఆగిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలుపడంతో.. నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో పెట్టుబడి సాయం త్వ‌ర‌లోనే రైతుల‌ ఖాతాల్లో జ‌మ అవ‌నున్నాయి.

Next Story