హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆ నగదును సీజ్ చేస్తారు. తనిఖీల సమయంలో డాక్యుమెంట్స్ చూపలేకపోతే తర్వాత సమర్పించినా డబ్బును తిరిగిస్తారు. రూల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్‌ను నిన్న ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ రాణి కుముదిని వివరాలు మీడియాకు వెల్లడించారు. మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్. అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్. అక్టోబర్ 17న సర్పంచి ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేస్తారు. 31న తొలి విడత పోలింగ్. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు. నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు. నవంబర్ 8న పోలింగ్. కాగా మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.