Rangareddy : వృద్ధ దంపతులను దారుణంగా చంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలియదు కానీ రక్తం మడుగులో పడి ఉన్న వృద్ధ దంపతులను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

By Kalasani Durgapraveen  Published on  16 Oct 2024 5:21 PM IST
Rangareddy : వృద్ధ దంపతులను దారుణంగా చంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలియదు కానీ రక్తం మడుగులో పడి ఉన్న వృద్ధ దంపతులను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దంపతులిద్దరూ దారుణ హత్యకు గురి కావడంతో స్థానికంగా తీవ్ర‌ కలకలం రేగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నాగుర్ కర్నూలు జిల్లా ముష్టి పెళ్లికి చెందిన ఉషయ్య (55), శాంతమ్మ (50) అనే దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదు నగరానికి వచ్చి రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో నివాసం ఉంటున్నారు. కొత్తగూడెం గ్రామం శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈ వృద్ధదంపతులు పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే.. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధ దంపతులను చూసిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కందుకూరు పోలీసులు.. క్లూస్ టీమ్స్, డాగ్స్ గార్డ్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. వృద్ధ దంపతులను ఎవరు చంపారు.? ఎందుకు చంపారు.? అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story