భారీగా పెరిగిన కోడిగుడ్డు ధర

కోడి గుడ్డు ధర చుక్కలు చూపిస్తోంది. చలికాలం.. డిమాండ్ బాగాపెరిగింది. ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది.

By అంజి  Published on  2 Jan 2024 1:57 AM GMT
egg price, Telangana, Poultry

భారీగా పెరిగిన కోడిగుడ్డు ధర

కోడి గుడ్డు ధర చుక్కలు చూపిస్తోంది. చలికాలం.. డిమాండ్ బాగాపెరిగింది. ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది. కోళ్ల దాణా ధరలు పెరగడమే గుడ్డు రేటు పెరగడానికి కారణమంటున్నారు కోళ్లఫారమ్‌ నిర్వాహకులు. కార్తీక మాసం ముగిసిన తర్వాత నుండి గుడ్ల వినియోగం, ధర పెరుగుతూ వస్తోంది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50 గా ఉంది. ఈ ధర వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. ఇప్పుడు కోడిగుడ్డు ధర రూ.7 పలుకుతోంది. వారం రోజుల్లోనే డజన్ల గుడ్ల ధర రూ.72 నుంచి రూ.84కు చేరుకుంది. ఇక హోల్‌సేల్‌లో కూడా ఒక్కో గుడ్డు ధర రూ.5.76గా ఉంది. మరోవైపు చికెన్‌ ధర కూడా పెరగింది.

కార్తీక మాసం సమయంలో కిలో చికెన్‌ రూ.170గా ఉంటే.. ఇప్పుడు రూ.240 కి చేరింది. తెలంగాణ కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మూడో ప్లేస్‌లో ఉంది. రాష్ట్రంలో ఏటా 17.67 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కొన్ని రోజుల నుండి చలి పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీని కారణంగానే గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దాణా ఛార్జీలు పెరగడం, వాహనదారులు గత రెండు నెలల్లో రవాణా ఖర్చులు 15 శాతం పెంచడం వల్ల గుడ్ల ధర పెరిగిందని చెబుతున్నారు. క్వింటాలు సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం క్వింటాలుకు రూ.5 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.7,200కు చేరిందని, మొక్కజొన్న క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు పెరిగింది.

Next Story