విద్యార్థులకు గుడ్‌న్యూస్..మళ్లీ మూడు రోజులు సెలవులు?

తెలంగాణలో విద్యాసంస్థలకు మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది.

By -  Knakam Karthik
Published on : 5 Feb 2026 9:44 AM IST

Telangana, Educational institutions, Holidays, Municipal Elections, Couting

విద్యార్థులకు గుడ్‌న్యూస్..మళ్లీ మూడు రోజులు సెలవులు?

తెలంగాణలో విద్యాసంస్థలకు మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు రానున్నాయి.

కాగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో 11న ఎలక్షన్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఈ సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు తేదీన సెలవుపై ఒకటి లేదా రెండు రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు వెలువడవచ్చు.

Next Story