ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నేడు(గురువారం) విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై కవిత స్పందించింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్లు, వేర్వేరు కార్యక్రమాల కారణంగా గురువారం విచారణకు హాజరుకాలేనని బుధవారం కవిత ఈడీ అధికారులకు లేఖ రాసింది.
దీనిపై గురువారం ఉదయం ఈడీ అధికారులు స్పందించారు. కవితకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్చి 11 (శనివారం) విచారణకు హాజరు కావాలని సూచించింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ఇక యథావిధిగా రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష కొనసాగనుంది.
ఇదిలా ఉంటే.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం జరగనుంది. కవిత ఎం మాట్లాడనున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.