టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids on MP Nama Nageswararao house.టీఆర్ఎస్ లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు ఇంట్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 7:36 AM GMT
టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

టీఆర్ఎస్ లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసం, హైదరాబాద్‌లోని నామా నాగేశ్వరరావు కంపెనీ మధుకాన్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ కే శ్రీనివాస్ రావు, డైరెక్టర్లు ఎన్. సీతయ్య, ఎన్. పృథ్వీ తేజ నివాసంలోనూ తనిఖీలు చేశారు. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకొని విదేశీ కంపెనీలు డబ్బులను మళ్లించినట్లు నామా నాగేశ్వరరావుపై అభియోగాలు వచ్చాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థ‌ల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టుల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని వారు అన్వేషిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వ‌ర‌కు ఈడీ సోదాలు కొన‌సాగే అవ‌కాశం ఉంది.

Next Story