కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు.. ఎవరిని పంపారంటే?

ED once again issued notices to Kavitha in Delhi Liquor Scam. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను

By M.S.R  Published on  28 March 2023 4:10 PM IST
కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు.. ఎవరిని పంపారంటే?

Kavitha Kalvakuntla


ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ అధికారులు విచారించారు. ఆమె మార్చి 11,20,21 తేదీల్లో ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఢిల్లీ కార్యాలయానికి రావాలని లేఖ ద్వారా కోరింది. ఈడీ పిలుపుపై స్పందించిన కవిత ప్రతిగా తన లీగల్‌ అడ్వైజర్‌ను పంపించారు. మార్చి 11న ఎమ్మెల్సీ కవితకు చెందిన ఫోన్‌ను ఈడీ అధికారులు సీజ్‌ చేయగా, ఈనెల 21న తన 9 ఫోన్లను ఈడీకి అందజేశారు. సీజ్‌ చేసిన ఫోన్లను ఓపెన్‌ చేసేందుకు సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్‌ అడ్వైజర్‌ సోమా భరత్‌కు ఆథరైజేషన్‌ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు పంపారు.


Next Story