రేవంత్ రెడ్డికి ఊహించని షాక్

ED files Chargesheet Against Revanth Reddy. ఏసీబీ చార్ఝీషీట్ ఆధారంగా రేవంత్ రెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

By Medi Samrat  Published on  27 May 2021 10:44 AM GMT
Revanth Reddy

ఓటుకు నోటు కేసు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో ఈడీ గురువారం నాడు ఛార్జీషీటు దాఖలు చేసింది. ఏసీబీ చార్ఝీషీట్ ఆధారంగా రేవంత్ రెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్‌సన్ కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఏసీబీకి రేవంత్ రెడ్డి చిక్కారు. మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ తో క్రాస్ ఓటింగ్ చేసేలా రేవంత్ రెడ్డి రాయబారం నడిపారని ఏసీబీ అభియోగం మోపింది.

2015 మే 31వ తేదీన స్టీఫెన్ సన్ వద్ద డబ్బు సంచులతో ఉన్న రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీని వదిలి కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణన్ కీర్తన్ రెడ్డి, బిషఫ్ సెబాస్టియన్ పేర్లను కూడ ప్రస్తావించింది. ఈ డబ్బును వేం నరేందర్ రెడ్డి తనయుడు కీర్తన్ రెడ్డి తెచ్చినట్టుగా ఏసీబీ, ఈడీ ఆరోపించింది. ఓటింగ్ జరిగిన తర్వాత దేశం విడిచిపోయేందుకు గాను రూ. 2 కోట్లను రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ ఆఫర్ ఇచ్చాడు. ఇందులో భాగంగా రూ. 50 లక్షలను ఇవ్వనున్నట్టుగా ఆఫర్ ప్రకటించినట్టుగా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడిన సంభాషణను కూడ ఏసీబీ రికార్డు చేసింది.

టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసేలా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ ఆరోపించింది. ఏసీబీ ఛార్జీషీట్ లో రేవంత్ రెడ్డి సహా పలువురి పేర్లను ప్రకటించింది.


Next Story