తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఈసీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 6:41 PM ISTతెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఈసీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను డీజీపీని సస్పెండ్ చేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే డీజీపీ అంజనీకుమార్.. మరో ఇద్దరు డీజీలతో కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిశారు. పుష్ప గుచ్చాన్ని ఆయనకు అందజేసి.. శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే.. ఆ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. ఈ కమ్రంలోనే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి డీజీపీ అంజనీకుమార్ రేవంత్‌రెడ్డిని కలిశారని ఎన్నికల సంఘం తేల్చింది. దాంతో.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. డీజీపీతో పాటు ఉన్న అదనపు డీజీలు సందీప్‌కుమార్ జైన్, మహేశ్ భగవత్‌కు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు.