వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కపించింది. పరిగి మండలంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా భాషిరెడ్డిపల్లి ప్రాంతంలో తెల్లవారుజామున కొన్నిసెకన్ల పాటు భూమి కంపించని అంటున్నారు. ఓ వైపు జోరుగా వర్షం కురుస్తుండగా.. మరోవైపు భూమి స్వల్పంగా కంపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రంగాపూర్, బసిరెడ్డిపల్లి, న్యామత్ నగర్‌లో భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత ఎంత.. తదితర వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2024 ఫిబ్రవరిలో వికారాబాద్ జిల్లాలో 2.5 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. 2022లో కూడా జిల్లాలోని పరిగి మండలంలో భూమి కంపించింది.