కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కాగా.. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని రేపటి నుంచి తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 17 వరకు అంటే మొత్తం 12 రోజులు రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. తిరిగి 18 తేది నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి.
ఇంటర్ కళాశాలలకు నాలుగు రోజులే..
ఇంటర్ విద్యార్థులకు కూడా సెలవులు ఇచ్చారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో దసరా సెలవుల్లో కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి 16 వరకు అంటే.. నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. 17 నుంచి కాలేజీలు ప్రారంభంకానున్నాయి.
ఇక దసరాతో పాటు దీపావళి పండుగులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కరోనా పూర్తిగా పోలేదని.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగలు చేసుకోవాలని చెప్పింది.