రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. జూన్ రెండో వారం వచ్చినప్పటికీ వర్షాల జాడ లేకపోవడంతో పలుచోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి మరో వారం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఇలాగే వేడి ఉంటుందంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఎండవేడిలో పిలల్లను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అనధికారికంగా పాఠశాలల ప్రారంభ తేదీని ఐదు రోజులకు వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. కనీసం 4-5 రోజులైనా సెలవులను పొడిగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.