దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
Dubbaka MLA Raghunandhan Rao Arrest. బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on
5 March 2021 8:46 AM GMT

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిహారం ఇవ్వకుండా అధికారులను ప్రాజెక్ట్ దగ్గరకు రానిచ్చేదిలేదంటూ గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్ధతుగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రాజెక్ట్ దగ్గరికి బయలుదేరారు. దాంతో పోలీసులు ఆయనను మార్గమధ్యం తొగుటలో అడ్డుకొని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితులకు సిద్దిపేట, గజ్వేల్ తరహాలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. కిష్టాపూర్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story