Video: మద్యం సేవించి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుతుపల్లి గ్రామంలో గురువారం మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనందుకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు

By Knakam Karthik
Published on : 4 Sept 2025 12:49 PM IST

Telangana, Asigfabad District, Jainoor Mandal, Teacher Suspended, Tribal Welfare Department

Video: మద్యం సేవించి స్కూలుకు వచ్చి క్లాస్ రూంలో నిద్రపోయిన టీచర్

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుతుపల్లి గ్రామంలో గురువారం మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనందుకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ అధికారులు హెచ్చరించారు.

పాఠశాలలో మద్యం తాగి ఉన్నందుకు ఉపాధ్యాయుడు జె విలాస్‌ను సస్పెండ్ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడిపై చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిపై చర్య తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణను నిర్ధారించడానికి పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు హెచ్చరించారు.

Next Story