హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మొత్తం 908 డిగ్రీ కాలేజీల్లో మూడు దశల్లో సీట్లు కేటాయించనున్నారు. ఇంటర్‌లో మార్కులు, ఎంచుకునే కోర్సుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లకు నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ నిన్న విడుదలైంది. మే 3 నుంచి 21 వరకు ఫస్ట్ ఫేజ్ దరఖాస్తులు, 29న సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. మే 30 నుంచి జూన్ 8 వరకు సెకండ్ ఫేజ్ దరఖాస్తులు, జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 13 నుంచి 19 వరకు మూడో ఫేజ్, జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.