తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం పొడిగిస్తూ డీఓపీటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఏడు నెలలు ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. దీని ప్రకారం వచ్చే సంవత్సరం అనగా.. 2026, మార్చి 31 వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ డీఓపీటీ (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) ఉత్తర్వులు జారీ చేసింది. అలానే డీఓపీటీ అండర్ సెక్రటరీ భూపేందర్ పాల్ సింగ్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
అయితే ఈ నెలాఖరున అనగా ఆగస్టు 31న కె.రామకృష్ణారావు పదవీ కాలం ముగుస్తుంది. ఆగస్టు చివరన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడిగించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని సెంట్రల్ సర్కార్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లే కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో ఏడు నెలలు అనగా వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వుల జారీ చేసింది.