సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023కి సంబంధించి మంగళవారం ప్రకటించిన ఫలితాల ప్రకారం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లో తెలంగాణ మహిళ మూడో స్థానంలో నిలిచింది. ఆదిత్య శ్రీవాస్తవ టాప్ ర్యాంక్ సాధించగా, అనిమేష్ ప్రధాన్, డోనూరు అనన్యారెడ్డి వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు.
అనన్య మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినది. డియు మిరాండా హౌస్‌లో పట్టభద్రురాలైంది. జాగ్రఫీలో బిఎ ఆనర్స్ చదివింది. అనన్య ఫస్ట్ అటెంప్ట్‌లోనే సత్తా చాటారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని రోజుకు 12 - 14 గంటలు చదివేదానినని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్న అనన్య చెప్పారు.
మొత్తం 1,016 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సేవలకు సిఫార్సు చేయబడ్డారు. సివిల్ సర్వీసెస్ పరీక్షను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులను ఎంపిక చేయడానికి యూపీఎస్‌సీ ద్వారా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ - మూడు దశల్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.