తెలంగాణలోని కామారెడ్డిలో సోమవారం కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి తల, కడుపుపై గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి మండలం కామారెడ్డి ముధోలి గ్రామంలో చోటుచేసుకుంది. ఫంక్షన్ హాల్ బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. బాధతో ఉన్న బాలుడిని చూసిన స్థానికులు ఎలాగోలా కుక్కను అక్కడి వెళ్లగొట్టి, బాలుడిని వెంటనే నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల, పొట్టపై గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. స్థానికులు సమయానికి స్పందించడంతో బాలుడికి ప్రాణాప్రాయం తప్పింది. అయితే ఈ ఘటనపై పోలీసులు, మున్సిపల్ అధికారుల స్పందించాల్సి ఉంది.
భవిష్యత్తులో కుక్కల దాడులు జరగకుండా 'పూర్తి కెపాసిటీ'తో పనిచేస్తానని తెలంగాణ మంత్రి కెటి రామారావు ఫిబ్రవరిలో చెప్పడం గమనార్హం. హైదరాబాద్‌లో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. “మేము మా మున్సిపాలిటీలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను సృష్టించాము. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం ”అని కేటీఆర్ చెప్పారు.