మహారాష్ట్రలో ఆమెపై పాఠ్యాంశం.. దివ్యాంగ రచయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూత

Divyang writer Boora Rajeshwari passes away. రాజన్న సిరిసిల్లకు చెందిన దివ్యాంగ రచయిత్రి బూర రాజేశ్వరి (43) బుధవారం కన్నుమూసింది.

By M.S.R
Published on : 28 Dec 2022 7:45 PM IST

మహారాష్ట్రలో ఆమెపై పాఠ్యాంశం.. దివ్యాంగ రచయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూత

రాజన్న సిరిసిల్లకు చెందిన దివ్యాంగ రచయిత్రి బూర రాజేశ్వరి (43) బుధవారం కన్నుమూసింది. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని నివాసంలో తుదిశ్వాస విడిచింది. రాజేశ్వరి కాళ్లతో ఎన్నో కవితలు రాసి పురస్కారాలను అందుకుంది. సామాజిక, వర్తమాన అంశాలపై 350 వరకు కవితలు రాసింది. రాజేశ్వరి కవితలను సుద్దాల ఫౌండేషన్‌ పుస్తకం రూపంలోకి తీసుకురాగా ఈ బుక్‌ను రవీంద్రభారతిలో జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత దివంగత సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) ఆవిష్కరించారు. రాజేశ్వరి జీవితాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది.

దివ్యాంగురాలైన ఆమె రాణించడం కేసీఆర్‌ను ఆకట్టుకుంది. వెంటనే ప్రభుత్వం తరపున ఆమె పేరిట రూ.10 లక్షలు ఫిక్స్డ్ చేయించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని కేసీఆర్‌ కాలనీలో ఆమెకు ఒక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కూడా కేటాయించారు. నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. రాజేశ్వరి మృతికి మానేరు రచయితల సంఘం సంతాపం ప్రకటించింది.


Next Story