చిలుకూరులో విద్యార్థులకు ఉచితంగా నోట్‌ బుక్‌ల పంపిణీ

చిలుకూరు గ్రామ పరిధిలోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈరోజు నోటు బుక్‌లను పంపిణీ చేశారు.

By అంజి  Published on  3 July 2024 4:45 PM IST
notebooks, students, Chilukur Village, Chilukur Blaji Temple

చిలుకూరులో విద్యార్థులకు ఉచితంగా నోట్‌ బుక్‌ల పంపిణీ 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ పరిధిలోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈరోజు నోటు బుక్‌లను పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సొంత నిధులతో సమకూర్చిన నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి విద్యను అందించే ప్రయత్నంలో సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్నవారు, ఐశ్వర్యవంతులు.. అందరూ ముందుకు రావాలని,ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంచి సహకారాన్ని అందించాలని కోరారు.

విద్యార్థులు కూడా ఉన్నతంగా చదవాలన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ఈ ప్రాథమిక పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడానికి ఎంతో తోడ్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమయ్య, సహోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి,రాజశేఖర్ రమాదేవి, రాజు,చిలుకూరు బాలాజీ దేవాలయం సేవా బృందం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా అర్చకులు రంగరాజన్ గతంలో కూడా సమాజం కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు.

Next Story