'మన ఊరు-మన బడి పథకం' కింద.. సర్కార్‌ బడుల్లో డిజిటల్ తరగతులు

Digital classes in govt schools under Telangana's 'Mana Ooru-Mana Badi scheme': Sabitha. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి

By అంజి  Published on  11 March 2022 11:38 AM IST
మన ఊరు-మన బడి పథకం కింద.. సర్కార్‌ బడుల్లో డిజిటల్ తరగతులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 'మన ఊరు-మన బడి' పథకాన్ని ప్రారంభించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. శాసనమండలి సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ గ్రామాల్లో మన ఊరు - మన బడి, పట్టణాల్లో మన బస్తీ - మన బడి పేరుతో పథకం అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం కింద నీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుత్ సమస్యలు, తాగునీటి సమస్యలు, ఫర్నీచర్, పెయింటింగ్, గ్రీన్ చార్ట్ బోర్డులు, కాంపౌండ్ వాల్స్, డైనింగ్ హాళ్లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు తదితర 12 అంశాలను ప్రతిపాదించామని ఆమె తెలిపారు. ఈ పథకం మూడు దశల్లో అమలు చేయబడుతుంది. రూ. 7000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని, డిజిటల్‌ క్లాసులను కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

Next Story