యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Devotees Rush in Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple due to sunday.యాదాద్రిశ్రీల‌క్ష్మీ న‌ర‌సింహస్వామి ఆల‌యానికి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 Nov 2022 12:07 PM IST

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో పాటు కార్తిక మాసం కావ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు త‌ర‌లివ‌చ్చారు. స‌త్య‌నారాయ‌ణ స్వామి వారి వ్ర‌తం కోసం భ‌క్తులు బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉండ‌డంతో ఆల‌య ప‌రిస‌రాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.


స్వామి వారి దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఉచిత ద‌ర్శ‌నానికి సుమారు 4 గంట‌లు, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి దాదాపు 2 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ఇక ల‌డ్డూ ప్ర‌సాదం కౌంట‌ర్లు, స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌త‌మండ‌పం, క‌ల్యాణ క‌ట్ట ప్రాంతాల్లో భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొని ఉంది.

Next Story