హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ బాధితుడు ఫిర్యాదు మేరకు మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. జోన్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ విప్పర్ల శ్రీనివాస్ ఫిర్యాదు దారుడి నుంచి రూ.2,20,000 లంచం డిమాండ్ చేయగా.. రూ.70,000 తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేశాడు. మొక్కల పదార్థాల సరఫరాకు చెక్ మెజర్డ్ బిల్లులను క్లియర్ చేసేందుకు శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడిని లంచం డబ్బులు తీసుకుని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపిన విధంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని శ్రీనివాస్ వద్దకు వచ్చాడు. అతని వద్ద నుండి డబ్బులు తీసుకుంటూ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.