అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్య, రూ.11,600 కోట్లు మంజూరు..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By Knakam Karthik  Published on  9 March 2025 5:33 PM IST
Telangana, Deputy CM Bhatti Vikramarka, Young India Integrated Residential Schools

అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్య, రూ.11,600 కోట్లు మంజూరు..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ రూ.11,600 కోట్లు మంజూరు చేసిందని, అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్‌నేషనల్ లెవల్, టెక్నాలజీతో వచ్చే ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేటులోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదన్నారు. ఒక్కో స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణం, అద్భుతమైన క్రీడా మైదానాలు, టీచింగ్ చెప్పే స్టాఫ్ కూడా అక్కడే ఉండే విధంగా కావాల్సిన వసతులు కల్పిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటిగ్రేటేడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేశామని.. ప్రైవేట్‎లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందిస్తామన్నారు.

రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని అభివర్ణించారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. డిజిటల్ ఎడ్యూకేషన్‌, మినీ థియేటర్ సహా అధ్యుతమైన డిజైన్ చేసి.. పేద విద్యార్థుల కోసం అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల నిర్మాణం ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే సిలబస్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని శాసించే కంపెనీల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా కూడా.. ప్రతి పైసా ప్రజల కోసం ఎలా ఖర్చు చేయాలా? అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

Next Story