దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజా పాలనను సాగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ మార్చి 31 లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రూ.2,000 అధికంగా ఇస్తున్నామని వనపర్తి సభలో తెలిపారు. ఏప్రిల్ 14న డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి రోజున అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కార్పొరేషన్లకు 6,000 కోట్ల రూపాయల నిధులతో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభిస్తామని భట్టి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వనపర్తి ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలని రూ. 2200 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ ను కెసిఆర్ కుటుంబం అడ్డుకోలేదన్నారు. అటు అంతకుముందు ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ.. ఉగాదికి గద్దర్ పేరిట ప్రభుత్వం సినీ కళాకారులకు ఇవ్వాలని సంకల్పించిదని తెలిపారు. ఫిలిం అవార్డులతో పాటు సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వారందిరినీ ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలను పెట్టి వారికి కూడా అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.