మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాలను వరంగల్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. హన్మకొండ, హంటర్ రోడ్డు సర్వే నంబర్ 125కే లోని తమకు చెందిన 400 గజాల స్థలాన్ని మందకృష్ణ మాదిగతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు అనే వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని నంబూరి చారుమతి రెండున్నర సంవత్సరాల క్రితం అధికారులకు కంప్లయింట్ చేశారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు ఆక్రమణ జరిగినట్లు తేల్చారు.
దీంతో కట్టడాలను కూల్చివేయాలని 2022 సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు. అయితే రెండు సంవత్సరాలు దాటిని కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయలేదని ఫిర్యాదు దారు చారుమతి మానవ హక్కుల కమిషన్ (NHRC)ని ఆశ్రయించారు. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ జనవరి 24వ తేదీ లోపు అక్రమ నిర్మాణౄలను నేలమట్టం చేయాలని అధికారులను ఆదేశించింది. NHRC ఉత్తర్వులును రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఆయనకు ఊరట లభించలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది కట్టడాలను కూల్చివేశారు.