తెలంగాణ చరిత్రలో 'దీక్షా దివస్' చిరస్మరణీయమైన రోజు: కేటీఆర్

‘Deeksha Divas’ a memorable day in Telangana’s history: KTR. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాము చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

By అంజి  Published on  29 Nov 2022 5:00 PM IST
తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్ చిరస్మరణీయమైన రోజు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాము చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ దీక్షా దివస్‌.. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టి 2009 నవంబర్ 29న కే చంద్రశేఖర్ రావు ఆమరణ దీక్షకు దిగి నేటికి 13 ఏళ్లు. నవంబరు 29 చరిత్రను మార్చిన రోజు అని, ఎప్పటికీ చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

''మీ పోరాటం అనివార్యం. కొత్త శకానికి నాంది పలికిన రోజు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టిని మరల్చే విధంగా తెగించిన రోజు. చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. దీక్షా దివస్ #దీక్షాదివస్ అని ట్వీట్ చేశారు'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడిగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. నవంబర్ 29, 2009న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ సిద్దిపేటకు దీక్ష కోసం బయలుదేరుతుండగా, కరీంనగర్ అలుగునూరు మానేరు వంతెన వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు, ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రికి తరలించిన కేసీఆర్ మరో 11 రోజుల పాటు పోరాటం కొనసాగించారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9న యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే ఆయన తన ఉద్యమాన్ని ముగించారు.

Next Story