రేషన్‌కార్డు దారులకు గుడ్‌న్యూస్‌.. ఈ-కేవైసీకి గడువు పెంపు

రేషన్‌ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర సర్కారు ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌ )ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ-కేవైసీ గడువును తాజాగా ప్రభుత్వం పెంచింది.

By అంజి  Published on  31 Dec 2023 7:00 AM IST
e KYC, ration cards, Telangana

రేషన్‌కార్డు దారులకు గుడ్‌న్యూస్‌.. ఈ-కేవైసీకి గడువు పెంపు

హైదరాబాద్‌: రేషన్‌ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర సర్కారు ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌ )ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ-కేవైసీ గడువును తాజాగా ప్రభుత్వం పెంచింది. రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్‌ కార్డులో ఎంతమంది ఉంటారో.. వారంతా రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి. రెండు నెలలుగా రేషన్‌ షాపుల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్‌ ధ్రువీకరణతో పాటు వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80 శాతం పూర్తయింది.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 87.81 శాతం నమోదుతో మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17 శాతం పూర్తయింది. రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఐరీస్‌, ఈ పోస్‌ మిషన్లు, జియోట్యాగింగ్‌ విధానాలను అందుబాటులోకి తెచ్చి కొంతమేర అడ్డుకట్ట వేయగలింది. అయితే సరుకులు తీసుకొనేందుకు కార్డుదారుల్లో ఏ ఒక్కరూ వేలిముద్ర వేసినా సరిపోయేది. దీంతో చనిపోయినవారి పేరిట సైతం సరుకులు తీసుకుంటున్నారు. కొందరు అర్హతలేని వారు కూడా కార్డులు పొంది నెలనెలా రేషన్‌ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరుకుల పంపిణీలో పూర్తి పారదర్శకత కోసం రేషన్‌ కార్డులను ఈ కేవైసీ చేస్తున్నారు.

Next Story