ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద పురోగతి..డెడ్‌బాడీని బయటకు తీసిన రెస్క్యూ టీమ్
ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో 16 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది.
By Knakam Karthik Published on 9 March 2025 8:18 PM IST
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద పురోగతి..డెడ్‌బాడీని బయటకు తీసిన రెస్క్యూ టీమ్
ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో 16 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. టన్నెల్‌లో ఒక డెడ్‌బాడీని రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఘటన జరిగిన 16 రోజుల తర్వాత ఒక మృతదేహాన్ని గుర్తించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామ సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ సొరంగంలో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్జీవంగా ఉన్నవారి కోసం 11 రెస్క్యూ బృందాల ఆపరేషన్ నిరంతరాయంగా 16 రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి రాబిన్స్ కంపెనీకి చెందిన ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని టీబీటీ మిషన్ సమీపంలో మట్టిలో ఇరుకపోయినట్లు కేరళకు చెందిన క్యాడ్వర్ డాగ్స్ గుర్తించాయి. దీంతో ఆ దిశగా ఆదివారం ఉదయం నుంచి రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టడంతో చివరికి మృతదేహాన్ని సొరంగం నుండి వెలికి తీశారు. మృతుడి చేతికున్న కడియం ఆధారంగా రాబిన్ కంపెనీ ఇంజనీర్స్ గురుప్రీత్ సింగ్ గా అధికారులు నిర్ధారించారు. ఆ మృతదేహాన్ని పార్థీవ దేహం వాహనంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం అధికారులు తరలించారు. ఈ రాత్రికి మరికొన్ని మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీసే అవకాశం ఉంది.